సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (17:11 IST)

ఎయిర్‌పోర్టులో మూత్రవిసర్జన చేసి షారూఖ్ తనయుడు?

ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగా బహిరంగంగా మూత్రవిసర్జన చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. 
 
డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఇలాంటి గలీజ్‌ పని చేసి పోలీసుల చేత చీవాట్లు తిన్నాడంటూ పలువురు నెటిజన్లు సదరు వీడియోను షేర్లు చేస్తున్నారు. 
 
కానీ వాస్తవానికి ఆ వీడియో నిజమే కానీ అందులో ఉన్న వ్యక్తి మాత్రం ఆర్యన్‌ ఖాన్‌ కాదు. కెనడియన్‌ నటుడు బ్రోన్సన్‌ పెలెటియర్‌. 2012లో లాస్‌ ఎంజిల్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో అందరిముందే పని కానిచ్చేయడంతో అధికారులు అతడిని అరెస్ట్‌ కూడా చేశారు.