ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (16:35 IST)

పార్లమెంట్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ : రేణుకా చౌదరి కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ ఇండస్ట్రీలోనేకాకుండా సాక్షాత్ ప్రజాదేవాలయంగా భావించే పార్లమెంట్‌లో కూ

కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ ఇండస్ట్రీలోనేకాకుండా సాక్షాత్ ప్రజాదేవాలయంగా భావించే పార్లమెంట్‌లో కూడా ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం బాలీవుడ్‌కు చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, ఒక్క సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని విభాగాల్లోనూ ఈ సమస్య ఉందంటూ వ్యాఖ్యానించారు. 
 
సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన రేణుకా చౌదరి తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు అని, అలాంటివి అన్ని చోట్లా జరుగుతుంటాయని, ఇది చేదు వాస్తమని చెప్పుకొచ్చారు. 
 
పార్లమెంట్ లేదా ఇతర పని ప్రాంతాల్లో వేధింపులు ఉండవన్న అభిప్రాయం సరికాదు అని ఆమె అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం రావాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారామె. హాలీవుడ్‌లో సాగుతున్న మీటూ ప్రచారం తరహాలో బాధితులు పోరాడాలన్నారు.