సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (11:15 IST)

శత వసంతంలోకి ప్రధాని మాతృమూర్తి.. హీరాబెన్​ కాళ్లు కడిగి.. ఆశీర్వాదం

Modi
Modi
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శత వసంతంలోకి అడుగుపెట్టారు. తన తల్లి వందల పడిలోకి ప్రవేశించడంతో ప్రధాని మోదీ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. గాంధీనగర్‌లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లారు. తన మాతృమూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమెకు మిఠాయి తినిపించారు. తల్లితో కాసేపు సరదాగా గడిపారు. ఆపై హీరాబెన్​ కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు.
 
హీరాబెడ్ మోడీ 1923 జూన్‌ 18న జన్మించారు. జూన్ 18తో ఆమె 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెట్టారు. 
PM modi
PM modi
 
తన తల్లి చిరకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ వడ్‌నగర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ప్రధాని తన తల్లితో పాటు గడిపిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.