శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (18:18 IST)

వివాదానికి దారితీసిన మోదీ తలపాగా.. ఏంటి సంగతి?

narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన తలపాగా వివాదానికి దారితీసింది. మహారాష్ట్రలోని పుణెలో ప్రఖ్యాత సంత్ తుకారాం మహరాజ్ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నందున ఆ సమయంలో ఆయన ధరించేందుకు ఈ టర్బన్‌ను రూపొందించారు.
 
తుకారాం అభంగాలలోని కొన్ని పదాలను తలపాగాపై ముద్రించారు. అయితే, ఈ పదాలను మార్చాలంటూ దేహు సంస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. "ఎవరి ప్రవర్తన మంచిగా ఉంటుందో వారికి మంచి జరుగుతుంది. దుష్ట తలంపు ఉంటే అందుకు తగ్గట్టే ఫలితం ఉంటుంది" అని ఆ టర్బన్‌పై రాసి డిజైన్ చేశారు. 
 
ఈ రాతలను వెంటనే మార్చాలని దేహు సంస్థాన్ అధ్యక్షుడు నితిన్ మహరాజ్ ఆదేశించారు. దాంతో 'విష్ణుమయ్ జగ్ వైష్ణవాంచ ధర్మ, భేదాభేద్ ధర్మ అమంగళ్' అంటూ ఆ రాతలను సవరించి తిరిగి తలపాగాను డిజైన్ చేయడంతో వివాదానికి తెరపడింది.