బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (13:03 IST)

వెంకయ్యగారు... మీరూ రాజీనామా చేయండి : పెరుగుతున్న ఒత్తిడి.. దిక్కుతోచని బీజేపీ

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖరాకండిగా చెప్పేశారు. ఈ ప్రకటనలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి.

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖరాకండిగా చెప్పేశారు. ఈ ప్రకటనలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు మాత్రులు రాజీనామాలు చేశారు. అలాగే, ఏపీ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు తప్పుకున్నారు. దీంతో టీడీపీ - బీజేపీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న తెలుగునేత ఎం. వెంకయ్య నాయుడుపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఆయన కూడా ఉపరాష్ట్రపదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు పెద్దదిక్కుగా ఉన్న వెంకయ్య నాయుడుని మంత్రి పదవి నుంచి తప్పించి తెలుగు వారికి కేంద్రం అన్యాయం చేసిందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ఇపుడు మళ్లీ వెంకయ్యను తెరముందుకు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన హామీలను దక్కించుకునేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యూహం రచిస్తున్నట్లు సోషల్‌మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. 
 
అందులో భాగంగానే కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రకటన చేశారని, ఫెడరల్ ఫ్రంట్‌ను రాబోయే కాలంలో నడిపించబోయేది వెంకయ్య నాయుడే అని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి వెంకయ్య నాయుడికి తెలియజేసి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు, కేసీఆర్‌లు ఆలోచన చేస్తున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు మరికోన్ని సోషల్‌మీడియా వెబ్‌సైట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇదే జరిగితే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.