సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:20 IST)

గంటకు రూ.54 లక్షలు..! రోజుకు రూ.13 కోట్లు..!! ఏడాదికి 4వేల కోట్లు!!!

గంటకు రూ.54 లక్షలు..! రోజుకు రూ.13 కోట్లు..!! ఏడాదికి 4వేల కోట్లు!!! ఏంటి ఈ లెక్కలు? 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి ఏదైనా కంపెనీ ఆదాయం వివరాలు అనుకుంటున్నారా? మీరూహించిందాంట్లో సగమే నిజం.. ఇది కంపెనీ ఆదాయం కాదు డెనిస్‌ కొయెత్స్‌ అనే మహిళ వార్షిక వేతనం. ఆ.. !! అని నోరెళ్లబెడుతున్నారా? ఇంకా ఉంది ఆగండి.
 
ఈమె పేరు చెప్పాం కదా.. ఉండేది లండన్‌లో.. వయసు 53 ఏళ్లు. ఆన్‌లైన్‌ జూదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బెట్‌ 365 కంపెనీ గురించి మనలో చాలా మందికి తెలుసు కదా? దాని బాస్‌ ఈమే. మొన్నటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణా ఈమెకు అందేది 469 మిలియన్‌ పౌండ్లు.

ఇందులో వేతనం 421 మిలియన్‌ పౌండ్లతోపాటు, కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్‌ కింద మరో 48 మిలియన్‌ పౌండ్లు అదనం. అంటే ఈ రెండూ కలిపితే ఆరోజు నాటి పౌండుతో రూపాయి విలువ ప్రకారం దాదాపు 4742,59,83,500 కోట్లు!! అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది.
 
ఇంకా చెప్పాలంటే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వార్షిక వేతనం కంటే సుమారు 2,360 రెట్లు డెనిస్‌ సొంతమైంది. అలాగే బ్రిటన్‌లోని 100 పెద్ద కంపెనీల సీవోల వార్షిక వేతనం కలిపినా అంతకంటే ఎక్కువే. కాగా, 2016తో పోలిస్తే డెనిస్‌ వార్షిక వేతనంలో పెరుగుదల 45శాతం అధికంగా నమోదైంది. అలాగే ఈ నాలుగేళ్లలో డెనిస్‌ మొత్తం ఆస్తి 1.3 బిలియన్‌ పౌండ్లకు చేరి, బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానం పొందింది.