సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 8 జూన్ 2018 (11:43 IST)

నానితో నేను కలిస్తే డర్టీ పిక్చరే... చూపిస్తా : మరోసారి పేలిన శ్రీరెడ్డి

‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 షో ప్రారంభ

‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి తన ట్విట్టర్‌లో  ట్వీట్ చేసింది. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. 
 
కొంతకాలంగా నాని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్న శ్రీరెడ్డి, బిగ్‌బాస్ ప్రసార సమయంలోనే బాంబ్‌ పేల్చే అవకాశముందని భావిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌, చిరంజీవి, నాగబాబు, హైపర్ ఆది ఇలా ఒక్కొక్క నటుడ్ని ఏకిపారేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి సినీనటుడు నానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అది కూడా నాని తనను వాడుకున్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.
 
సహజ నటుడిగా నానికి తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టయినవే. యువ హీరోల్లో నాని ఒకరు. ప్రస్తుతం నానిపై శ్రీరెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తను సినిమాల్లో అవకాశం కోసం ఒకసారి నానిని కలిశాననీ, ఆయన నన్ను చూసి నీకు అవకాశం ఇస్తానని చెప్పారనీ, ఐతే నాకు నువ్వు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాడని తెలిపింది. డైరెక్టర్, నిర్మాతలతో ఒప్పించి నీకు సినిమాలో క్యారెక్టర్లు తీసిచ్చే బాధ్యత నాది అని చెప్పారు నాని. దీంతో నేను ఒప్పుకున్నాను.
 
ఒప్పుకోవడమంటే నన్ను శారీరకంగా నాని అనుభవించాడు. మా పాత ఇంటికి రాత్రివేళల్లో వచ్చే నాని నాతో మూడుగంటల పాటు గడిపి ఆ తరువాత వెళ్ళిపోయేవాడు. అవకాశాల కోసం ఏం చేయాలో తెలియక అందుకు ఒప్పుకున్నానంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినీపరిశ్రమలో ఇదే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని నాని చాలా లైట్ తీసుకున్నారు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించలేదు.