Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SushantWasMurdered సుశాంత్‌ ఉరేసుకుంటే కాళ్లు ఎలా వంగుతాయ్..?

Written By సెల్వి
Updated: బుధవారం, 12 ఆగస్టు 2020 (14:48 IST)
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మృతి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు భావించినా..ఆ తర్వాత ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా హత్యే అనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితులు దీన్ని హత్యే అని చెప్పారు. తాజాగా సుశాంత్‌ మృతదేహాన్ని ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లిన అంబులెన్స్‌ సహాయకుడు చెప్పిన మాటలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
 
సుశాంత్‌ మృతదేహాన్ని మొదట చూసినపుడు పసుపుపచ్చ రంగులో ఉంది. ఒకవేళ ఉరివేసుకుంటే శరీరం రంగు మారదు. నోటి నుంచి నురగ వస్తుంది. కానీ నేను సుశాంత్‌ బాడీపై ఎలాంటి నురగ చూడలేదు. ఎవరైనా ఉరివేసుకుంటే మెడచుట్టూ గుర్తులుంటాయి. కానీ కేవలం ముందుభాగంలో మాత్రంలో గుర్తు కనిపించింది. అంతేకాదు సుశాంత్‌ కాళ్లు వంగి ఉన్నాయి. 
 
ఎవరైనా ఉరేసుకుంటే కాళ్లు ఎలా వంగిపోతాయని ఆంబులెన్స్ సహాయకుడు తెలిపాడు. సుశాంత్‌ కాలిపై తనకు ఓ గుర్తు కనిపించిందని చెప్పుకొచ్చాడు. సహాయకుడు చెప్పిన మాటలు బట్టి చూస్తే సుశాంత్‌ హత్య ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయి. సుశాంత్‌ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం #SushantWasMurdered అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. 

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments