Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వామ్మో.. త్రిష ఎంత సాహసం చేసింది.. 1168 ఎత్తులో బేస్ బాల్ మ్యాచ్‌ని చూస్తూ?

చెన్నై చిన్నది త్రిష ప్రస్తుతం కెనడాలో ఎంజాయ్ చేస్తోంది. సినిమాల్లో హీరోలు బంగీ జంప్ చేస్తుండటం చూసేవుంటాం. అందుకు వారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే హీరోయిన్ అయిన త్రిష.. పెద్ద రిస్కే తీసుకుంది.

Written By selvi
Updated: శుక్రవారం, 6 జులై 2018 (09:40 IST)
చెన్నై చిన్నది త్రిష ప్రస్తుతం కెనడాలో ఎంజాయ్ చేస్తోంది. సినిమాల్లో హీరోలు బంగీ జంప్ చేస్తుండటం చూసేవుంటాం. అందుకు వారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే హీరోయిన్ అయిన త్రిష.. పెద్ద రిస్కే తీసుకుంది. పార్టీలు, పబ్‌లు, బీచ్‌ల కంటూ వెళ్లొచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసింది. 
 
తాజాగా కెనడాలో ఓ బేస్ బాల్ స్టేడియంకు 1168 అడుగుల ఎత్తులో త్రిష చేసిన సాహసం చూస్తే అందరూ షాకవుతారు. అంత ఎత్తులో బంగీజంప్ చేయడానికి వెళ్లిన ఆమె, అక్కడే 10 నిమిషాల పాటు ఉండి, కింద జరుగుతున్న బేస్ బాల్ మ్యాచ్‌ని చూస్తూ ఉండిపోయింది. 
 
ఇక ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో త్రిష ఫోస్టు చేయడంతో ఆమె ఫ్యాన్స్ ముందు షాక్ అయినా.. ఆపై థ్రిల్ అవుతున్నారు. త్రిష సాహసానికి ప్రస్తుతం నెట్టింట్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సాహసానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం మోహిని త్వరలో తెరపైకి రానుంది. దీనితో పాటు గర్జన, 96, చతురంగవేట్టై–2, పరమపదం, 1818 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments