ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (18:45 IST)

కుక్కల నుంచి తప్పించుకుని.. ఏటీఎంలోకి జింక

శునకాల గుంపు నుంచి తప్పించుకున్న జింక ఏటీఎంలో చిక్కుకుంది. ఆ జింకను వన్యప్రాణి అధికారులు రక్షించారు. వివరాల్లోకి వెళితే..  కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు జింక గుజరాత్‌లోని అమ్రేలిలోని ఏటీఎం వెస్టిబ్యూల్‌లో చిక్కుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ వీడియోలో జింక శునకాల నుంచి తప్పించుకుని.. ఏటీఎంలోకి వెళ్లిపోయింది. దాని నుంచి బయటికి రాలేకపోయింది. ఏటీఎం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో  అటవీ శాక అధికారులు దానిని సురక్షితంగా కాపాడి.. అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి తీసుకెళ్లారు.