శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (15:57 IST)

నడిరోడ్డుపై సిగపట్లు పట్టుకున్న అమ్మాయిలు...

Girl Students fight
మహారాష్ట్రోలోని నాసిక్‌లో కొందరు అమ్మాయిలు నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు.. ఒకరి జుత్తు ఒకరు పట్టుకుని చిత్తు చిత్తుగా కొట్టుకున్నారు. వారిని తోటి స్నేహితురాళ్లు విడిదీసేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్‌‍ రోడ్డులో ఒక కాలేజీకి చెందిన ఇద్దరు అమ్మాయిల మధ్య కాలేజీ క్యాంటీన్‌‍లో సీట్ల విషయంలో గొడవపడ్డారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో క్యాంటీన్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిద్దరినీ బయటకు పంపించేశారు. 
 
దీంతో ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చిన తర్వాత కూడా వారు ఎవరిదారిన వారు వెళ్లలేదు. పైగా, రోడ్డుపై జట్లు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఆ ఇద్దరు స్నేహితురాళ్లను విడిదీసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ  వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంతలో కొందరు విద్యార్థులు వీరి సిగపట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్ అయింది.