ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (15:48 IST)

బాలికలను వేధించిన టీచర్.. చెప్పులతో కొట్టిన తల్లిదండ్రులు

Teacher
Teacher
పాఠశాలలపై బాలికలను వేధింపులకు గురిచేసిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా కొట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్లిప్‌లో మహిళలు టీచర్‌ను బూట్లు, చెప్పులతో కొట్టడం కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
 
పాఠశాలలో ఉపాధ్యాయుడి నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నట్లు బాలికలు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పూల్పూర్ పోలీసులు పాఠశాలకు చేరుకుని నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.