సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (19:52 IST)

ఏడోసారి ఆసియా కప్‌ సాధించిన టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు

women india cricket team
టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు శ‌నివారం ఆసియా క‌ప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆసియా కప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. ఆసియా క‌ప్ ఫైనల్‌లో శ్రీలంక జ‌ట్టును చిత్తు చేసిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఆసియా క‌ప్‌ను ఏడోసారి దేశానికి సంపాదించి పెట్టింది.

ఆసియా క‌ప్‌లో భాగంగా రెండు రోజుల క్రితం జ‌రిగిన సెమీస్‌లో విజ‌యంతో టైటిల్ పోరుకు అర్హ‌త సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శ‌నివారం శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన మ‌హిళ‌ల జ‌ట్టు విజేత‌గా నిలిచింది.

టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకోగా... భార‌త బౌల‌ర్లు లంక బ్యాట‌ర్ల‌ను క్రీజులో కుదురుకోనీయ లేదు. వ‌రుస‌గా వికెట్లు తీస్తూ లంక బ్యాటింగ్‌ను 20 ఓవర్ల‌లో కేవలం 69 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది.

ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... కేవలం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి శ్రీలంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని కేవలం 8.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. వెర‌సి లంక‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజయం సాధించింది.