బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ! సరైన నిర్ణయమన్న రవిశాస్త్రి
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం ఖరారైంది. ఆయన ఈ నెల 18వ తేదీ నుంచి బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడుగా ఉన్నారు.
ఈ నియామకంపై ఆ జట్టు సభ్యుడైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం సరైన నిర్ణయమని అన్నారు. బిన్నీ విజయవంతమైన బీసీసీఐ అధ్యక్షుడుగా కొనసాగుతాడని, ఆయనకు ఆ మేరకు అన్ని విధాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని రవిశాస్త్రి అన్నారు.
బిన్నీని ఎంపికపట్ల తాను సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే బిన్నీ ప్రపంచ కప్‌లో తన సహచర ఆటగాడు, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. పైగా, బీసీసీఐ చరిత్రలో ప్రపంచ కప్ విజేత జట్టుకు చెందిన సభ్యుడిని బీసీసీఐ చీఫ్‌గా నియమించడం ఇదే తొలిసారి అని రవిశాస్త్రి గుర్తుచేశారు.