శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (22:11 IST)

నీలి రంగు ఇడ్లీలు.. చట్నీతో టేస్ట్ చేశారా? (video)

Blue idly
Blue idly
సోషల్ మీడియా పుణ్యమాని రకరకాల వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వంటకాలను యూట్యూబ్‌లో సోషల్ మీడియాల్లో పోస్టు చేసి కామెంట్లు, లైకులు, షేర్లు పొందేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌లో ప్రస్తుతం దొరకని వంటంటూ లేదు. సెర్చ్ చేస్తే వంటకాల వీడియో ఎన్నెన్నో దర్శనమిస్తాయి. 
 
తాజాగా నీలి రంగు ఇడ్లీలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ మహిళ నీలి శంఖు పువ్వుల రసంతో నీలి రంగు ఇడ్లీలను తయారు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ అయిన జ్యోతి కల్బుర్గి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 
జ్యోతి ముందుగా కొన్ని నీలి శంఖు పువ్వులను నీటిలో ఉడకబెట్టి.. ఆ రసంతో ఇడ్లీలను తయారు చేసింది. అనంతరం రంగురంగుల ఇడ్లీలను చట్నీతో వడ్డించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.