శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (19:23 IST)

అది రోల్స్ రాయిస్ ఆటో.. ఆటోను కారుగా మార్చేశాడు.. వీడియో వైరల్

Autorickshaw into Convertible Car
కన్వర్టబుల్ కారులాగా మార్చబడిన ఆటోరిక్షా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ పెయింట్ చేయబడిన ఈ వాహనం, ఒక బటన్ నొక్కినప్పుడు వెనుకకు ముడుచుకునే పైకప్పును కలిగి ఉంది.
 
అలాగే సీట్లు కూడా గులాబీ రంగులో ఉంటాయి. ఈ వీడియోను ఆటోరిక్షా_కేరళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షేర్ చేసిన గంటల్లోనే ఈ వీడియోను ఒక మిలియన్ల మంది వీక్షించారు. చాలామంది నెటిజన్లు వాహనం ప్రత్యేకమైన డిజైన్‌ను మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
ఒక నెటిజన్ అయితే దీనిని "రోల్స్ రాయిస్ ఆఫ్ ఆటోస్" అని పిలిచాడు. ఆటోను కారుగా మార్చగలిగిన సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.