1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 24 మార్చి 2023 (16:29 IST)

అమ్మో.. నాగుపాము.. అటకెక్కి కూర్చున్నారు.. బిక్కు బిక్కు మంటూ..?

snake
snake
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. ఇంట్లోకి పాము రావడంతో ఒక కుటుంబం అటకెక్కి కూర్చుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటికి సొంతమైన వారు అటక పైకెక్కి బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. ఆ పాము ఎక్కడ చూస్తుందా అంటూ జడుసుకున్నారు.  
 
గుండెల్ని ఆపేసే విధంగా వున్న వీడియోలో విషపూరితమైన పాము గది తలుపుల వెనుక పడగ విప్పి వుండటం  చూడవచ్చు, అయితే ఒక ధైర్యవంతులైన మహిళ, ఇద్దరు అబ్బాయిలతో సహా భయంకరమైన కుటుంబం అటకెక్కారు. 
 
గంటల తరబడి అక్కడే వుండిపోయారు. ఆపై పాములు పట్టేవారికి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి వచ్చి పామును పట్టుకోవడంతో ఆ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.