ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (11:11 IST)

గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై దాడి..

Goa
Goa
గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై దాడి జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్టులో వుంటున్న వారిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తమపై దాడి జరిగిన విషయాన్ని బాధితుడు జతిన్ శర్మ సోషల్ మీడియాలో తెలిపారు. 
 
అంతకుముందు హోటల్ సిబ్బందితో జరిగిందని చెప్పాడు. సిబ్బంది తీరుపై హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని తొలగించారని తెలిపాడు. బాధిత కుటుంబం ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లింది. దుండగులు ఆ కుటుంబంపై దాడి చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.