గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (17:35 IST)

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఫ్యామిలీకి చిక్కులు..

Helicopter
హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఓ ఫ్యామిలీ వెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ హెలికాఫ్టర్ కాస్త ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తమ హెలికాఫ్టర్ ల్యాండింగ్ చేశారు. 
 
అక్కడే అసలు వివాదం మొదలైంది.  తన బంధువుల పెళ్లి కోసం సకుటుంబ సపరివారంగా హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్త ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు వెళ్ళాడు.
 
నెల్లూరులోని అనంతసాగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూతో పాటు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. 
 
దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఆ హైదరాబాద్ ఫ్యామిలీ మాత్రం అన్నీ అనుమతులు తీసుకున్నాకే ల్యాండింగ్ చేసినట్లు చెప్తున్నారు.