ఆర్.ఆర్.ఆర్. లైవ్ ప్రోగ్రామ్‌కు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ
Rahul Sipliganj and Kalabhairava
ఇంతవరకు ఆర్.ఆర్.ఆర్.లో నాటునాటు పాటకు అవార్డు దక్కడంపై ప్రశంసలుతోపాటు విమర్శలుకూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతోపాటు బయట కూడా చాలామంది గాయకులను సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కామెంట్ చేశారు. కానీ అకాడమీ ఆలోచనలు వేరుగా వుంటాయి. ఒక పద్ధతి ప్రకారం వారు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొదట్లో రాజమౌళి కుటుంబమే వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబోస్ వెళ్ళాడు.
ఇక ఈరోజు అకాడమీ ట్విట్టర్ లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 95వ ఆస్కార్‌లో ప్రత్యక్ష ప్రసారం మార్చి 12, ఆదివారంనాడు జరగనుంది. అందుకు ఆర్.ఆర్.ఆర్. లైవ్ ప్రోగ్రామ్‌కు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు కొన్ని వర్గాల వారు చేసిన విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.