గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (07:35 IST)

నెల్లూరి పెద్దారెడ్డి సీన్ రిపీట్.. బ్రహ్మానందంలా బుకైన వ్యక్తి

Drunk and Drive
Drunk and Drive
బంజారాహిల్స్‌లో గత రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతున్న యువకుడిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. రక్తంలో ఆల్కహాల్ గాఢత 94 పాయింట్లు ఉన్నట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో వెల్లడైనప్పుడు అధిక మొత్తంలో మద్యం సేవించిన వ్యక్తి అక్కడికక్కడే అడ్డంగా బుక్కయ్యాడు.
 
ట్రాఫిక్ ఎస్‌ఐ తన కారులోంచి దిగాలని చెప్పడంతో ఆ వ్యక్తి రెచ్చిపోయి అధికారులపై దుర్భాషలాడాడు. అరెస్టును అడ్డుకునే ప్రయత్నంలో, సమస్య నుండి బయటపడేందుకు హైకోర్టు న్యాయమూర్తితో తనకున్న సంబంధాన్ని ఉపయోగించుకుంటానని బెదిరించాడు. ఎస్ఐతో వాగులాటకు దిగాడు. ఓవర్‌గా బిల్డప్ చేశాడు.
 
దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. ఈ యువకుడు అరెస్టయిన సీన్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించిన నెల్లూరి పెద్దారెడ్డి సినిమాలోని ఒక సీన్‌ని రీక్రియేట్ చేసినట్లైంది.