1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (10:30 IST)

ప్రీతి ఆత్మహత్యపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ర్యాగింగ్ మాత్రమే కాదు..

bandi sanjay
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రీతి ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడికో ప్రీతి ఘటనపై స్పందించారు. 
 
నిందితుడు సైఫ్‌ను కాపాడే కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ర్యాగింగ్ మాత్రమే కాదని.. దీని వెనుక లవ్ జీహార్ కూడా వుందని తెలిపారు. 
 
ఈ కేసును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. నిందితుడిని కాపాడేందుకు జైలుకు పంపుతున్నారని.. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 
 
ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని.. ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు అంటే కేసీఆర్‌కు కోపమని.. సైఫ్‌ను మీరు వదిలిపెట్టినా ప్రజలు వదిలిపెట్టరంటూ హెచ్చరించారు.