మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (11:17 IST)

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఒకే సిరంజితో ఇంజెక్షన్లు.. బాలికకు హెచ్.ఐ.వి

hiv-aids
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వైద్యులు తమ విధుల్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఓ బాలికకు హెచ్.ఐ.వి సోకేందుకు కారణమయ్యారు. ఒకే సిరంజితో అనేక మంది చిన్నారులకు ఇంజెక్షన్ వేశారు. దీంతో ఓ బాలికకు హెచ్.ఐ.వి. సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. 
 
ఒక్కటే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం వల్ల బాలికకు హెచ్.ఐ.వి సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్‌ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. 
 
ఒకే సిరింజితో అనేక మంది విద్యార్థులకు ఇంజెక్షన్ వేసిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఎతాలోని రాణి అవంతి భాయిలోధి ప్రభుత్వ వైద్య కాలేజీ‌ని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.