సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (15:51 IST)

గుజరాత్‌లో నీచాతి నీచం .. ఏడాదిన్నర బాలిక మృతదేహంపై అత్యాచారం..

deadbody
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్‌లోని తంగర ప్రాంతంలో ఒక నీచాతి నీచమైన ఘటన జరిగింది. యేడాదిన్నర వయస్సుండే ఓ బాలిక మృతదేహాపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
తంగర్ ప్రాంతానికి చెందిన యేడాదిన్నర బాలిక గుండెలో రంధ్రం ఉండటంతో చికిత్స పొందుతూ ఈ నెల 25వ తేదీన మృతిచెందింది. అదే రోజు చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. అయితే, మరుసటి రోజు రోజు కర్మక్రతువులు చేసేందుకు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి బంధువులు వెళ్లి చూడగా, అక్కడి దృశ్యాన్ని చూసి వారు చలించిపోయారు. 
 
బాలిక మృతదేహం మట్టిపై పడివుంది. బాలిక శరీరంపై నూలు పోగు కూడా లేదు. దీంతో బంధువులు మృతదేహంపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శవపరీక్ష రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే, ఇంత నీచానికి దిగజారిన కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.