శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (12:35 IST)

తాత అయిన బిల్ గేట్స్... కూతురు జెన్నీకి పండంటి అబ్బాయి

Jennifer
Jennifer
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తాత అయ్యారు. బిల్ గేట్స్  కూతురు జెన్నిఫర్ కేథరిన్ గేట్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా  ద్వారా జెన్నిఫర్ వెల్లడించారు. తన కుమారుడి పాదాల ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బిల్ గేట్స్ తన కూతురు, అల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు. జెన్నిఫర్, నయెల్ నాజర్ 2021లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
నాజర్‌కు ఈజిప్టు పౌరసత్వం వుంది. ఆయన తల్లిదండ్రులు ఈజిప్ట్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు.  నాజర్ షికాగోలో జన్మించారు. నాజర్ క్రీడాకారుడు కూడా. 2020 ఒలింపిక్స్ లో ఆయన ఈజిప్ట్ తరపును హార్స్ రేస్ పోటీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.