సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (13:33 IST)

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2020: ఈ మహమ్మారి ఏడాదిలో నర్సులు, మంత్రసానిల కృషిపై WHO

ఫోటో కర్టెసీ- WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రతి ఏటా వైద్య రంగంలో తమ సేవలు అందించేవారికి అభినందనలు తెలుపుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో ఈ ఏడాది వైద్యులు, నర్సులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు అందిస్తున్న అమోఘమైన సహకారం గుర్తించింది.
 
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతూ, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఈ యుద్ధంలో ముందు సైనికులుగా వుండి పోరాడుతున్నారు. అందువల్లనే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2020 గతంలో కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది.
 
1950 నుండి ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పాటించడం ప్రారంభించింది. 1948లో మొదటి ఆరోగ్య సభలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఆవశ్యకత చర్చించబడింది. ఇప్పుడు, ప్రతి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని ఒక నిర్దిష్ట ప్రాంతంపై దృష్టి పెట్టడమే కాకుండా లక్ష్యంగా పెట్టుకుంది.
అలా "మానసిక ఆరోగ్యం, తల్లి మరియు పిల్లల సంరక్షణ మరియు వాతావరణ మార్పు" రంగాలకు గణనీయమైన మార్పును తీసుకుని రాగలిగింది.
 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2020 యొక్క ట్యాగ్‌లైన్ ‘నర్సులు మరియు మంత్రసానిలకు మద్దతివ్వండి’ అనేది. COVID-19 వ్యాప్తి సమయంలో వారి సహకారం మరువలేనిదనీ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ యొక్క ప్రస్తుత స్థితిని హైలైట్ చేయాలని నిర్ణయించింది.