వేతన జీవులకు నిరాశ : ఆదాయపన్ను జోలికి వెళ్లని కేంద్రం
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనివ్వలేదు. కోట్లాది మంది ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూసే ఆదాయపన్ను శ్లాబు మార్పులు చేయలేదు. గత ఏడేళ్లుగా వీటి జోలికెళ్లని కేంద్రం.. ఈ దఫా కూడా ఉద్యోగులపై కనికరం చూపలేదు. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐటీ శ్లాబుల ప్రకారమే ఆదాయ పన్నును సమర్పించుకోవాల్సివుంది.
అయితే, 2022 జనవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.1.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ళు వచ్చాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో జీఎస్టీ వసూళ్లు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందింది అనేందుకు ఇదే ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అలాగే, భారత రిజర్వు బ్యాంకు ద్వారా సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. దీన్ని ఈ యేడాది నుంచే అమల్లోకి తీసుకునిరానుంది. రూపాయికి మరింత బలాన్ని ఇచ్చేలా ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కరెనీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీని రూపకల్పన చేయనున్నారు.
కాగా, బడ్జెట్ అంచనాలు
2022-23 మొత్తం బడ్జెట్ అంచనా రూ.39.45 లక్షల కోట్లు
2022-23 బడ్జెట్‌లో మొత్తం ద్రవ్య లోటు అంచనా రూ.6.4 శాతం
2025-23 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం.
2022-23 ఆదాయన వనరులు రూ.22.84 లక్షల కోట్లు