Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

Written By సెల్వి
Updated: శుక్రవారం, 22 నవంబరు 2024 (19:35 IST)
Cabbage Biryani
ఎప్పుడూ చికెన్, మటన్, వెజ్ బిర్యానీలతో బోర్ కొట్టేసిందా.. అయితే క్యాబేజీలో బిర్యానీ ట్రై చేయండి. విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉన్న క్యాబేజీ గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా కాన్సర్ నిరోధకంగా క్యాబేజీ తినొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
అంతేకాదు, పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. క్యాబేజీని తినడం వల్ల అధికబరువు, కండరాల నొప్పులు తగ్గించి జుట్టు పెరుగుదల పెరుగుతుంది. అలాంటి క్యాబేజీతో రుచికరమైన బిర్యానీ రైస్ ఎలా చేయాలంటే.. 
 
ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు సోంపు, లవంగం, రెండు యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆపై తరిగిన మూడేసి ఉల్లి, టమోటా, రెండు కప్పుల క్యాబేజీ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. 
 
అందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా కాస్త, కారానికి పచ్చిమిర్చి వేసి తగినంత ఉప్పు చేర్చుకోవాలి. అరకేజీ బియ్యానికి పైన చెప్పిన పదార్థాలు సరిపోతాయి. అలాగే ఒక గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసుల నీటిని చేర్చి.. కుక్కర్ క్లోజ్ చేయాలి. రెండు విజిల్స్ వచ్చాక దించేయాలి. 
 
ఇంతలో ఇందుకు పెరుగు పచ్చడి కూడా సిద్ధం చేసుకోవాలి. అంతే వేడి వేడి క్యాబేజీ బిర్యానీని పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది.

అన్నీ చూడండి

పసిడి కోసం ఆశపడి... పాడుబడిన బంగారు గనిలో దిగి చిక్కుకుపోయాడు...

మైనర్ బాలికకు రోబో లైంగిక వేధింపులు... ఎక్కడ?

న్యాయ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించినా మా ప్రతిఘటన కొనసాగుతుంది: రాహుల్ గాంధీ

మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం రాత్రికి రాత్రే వివాహం - చర్చకు దారితీసిన పెళ్లి

Weather forecast: October 14, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

Imanvi Birthday :రీ-రిలీజ్‌లు, ఫౌజీ అప్ డేట్ తో ఇమాన్వి, ప్రభాస్ పుట్టినరోజుకు సిద్ధమవుతున్న అభిమానులు

Rahul Sankrityan: దర్శకుడిగా నా ప్రయత్నం వృథా అనిపించింది : డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్

అప్పటి వరకు నేనే పెద్ద అందగత్తెను అనుకున్నాను : అనుష్క శర్మ

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

తర్వాతి కథనం
Show comments