వింటర్ స్పెషల్ : ధాల్ సూప్ టేస్ట్ చేయండి.

Written By Selvi
Updated: శుక్రవారం, 28 నవంబరు 2014 (17:34 IST)
వింటర్లో సాయంత్రం పూట మార్నింగ్ పూట ఒక కప్పు సూప్ ట్రై చేయండి. ఆకుకూరలు, కూరగాయలు, మటన్, చికెన్, సీ ఫుడ్స్‌తో పాటు చిరు ధాన్యాలతో కూడా సూప్ ట్రై చేయండి. చిరు ధాన్యాలతో తయారయ్యే సూప్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఫైబర్ లభిస్తుందని, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కావల్సిన పదార్థాలు:
కందిపప్పు : ఒక కప్పు 
ఉల్లిపాయ తరుగు: అర కప్పు 
అల్లం తురుము: ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి తరుగు: ఒక టీ స్పూన్ 
వెన్న లేదా నెయ్యి: ఒక టీ స్పూన్ 
పసుపు: చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్: ఒక టీ స్పూన్ 
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
నిమ్మరసం: కొద్దిగా
జీలకర్ర: ఒక టీ స్పూన్ 
పచ్చిమిర్చితరుగు: ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసి పది నిమిషాల పాటు నానబెట్టిన కందిపప్పుతో పసుపు, సన్నగా తరిగిన అల్లం వేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించి దింపేయాలి. బాగా చల్లారిన తర్వాత గరిటెతో మెదిపి తగినన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి. 
 
పాన్‌లో వెన్న లేదా నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత మెదిపి ఉంచుకున్న పప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిపి మరో ఐదు నిముషాలు మరిగించి దింపి, వడకట్టాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. 

అన్నీ చూడండి

తిరువణ్ణామలైలో విషాదం - మోక్ష మార్గంలో చిక్కుకుని తెలుగు భక్తుడు మృతి

జూలై 26, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

Gen Z: 21 ఏళ్లలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో యువత పోటీ.. జెన్-జెడ్‌కు రేవంత్ మద్దతు (video)

Kazipet: కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు

అన్నీ చూడండి

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Show comments