Festival Posters
✕

అవాంఛిత రోమాలతో సమస్యలా..!!

Written By xx
Updated: సోమవారం, 9 ఏప్రియల్ 2012 (13:34 IST)
FILE
అవాంఛితి రోమాల సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోంది. దానికి త్రెడింగ్, షేవింగ్ లాంటి పద్ధతుల కన్నా.. వ్యాక్సింగ్ చక్కని ప్రత్యామ్నాయం. దీన్ని తరచూ చేయించుకోవడం వల్ల అవాంచిత రోమాలు బలహినమై వాటి ఎదుగుదల క్రమంగా తగ్గిపోతుంది.

దాంతో పాటు... ఎండకు నల్లగా మారిన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మృత చర్మం తొలగి తాజాగా కనిపిస్తుంది. అవగాహన లేకుండా వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి శరీరంలో నెత్తురు గడ్డకట్టి చర్మంపై మచ్చలు పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో రకరకాల వ్యాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. అందులో...

పాట్‌వ్యాక్స్ :
ఇవి చిన్నచిన్న పాత్రల్లో వస్తాయి. పై పెదవి, ముఖంపైన ఉన్న అవాంఛిత రోమాల్ని తొలగించేందుకు ఇవి సరైన ఎంపిక. కానీ దీనివల్ల చాలా త్వరగా అంటే మూడో రోజుకే మళ్లీ సమస్య మొదలవుతుంది.

కోల్డ్ వ్యాక్స్ :
దీన్ని పలుచగా కాకుండా మందంగా వేసుకోవాలి. సరిగ్గా తొలగించలేకపోతే.. చర్మం పైపొర కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.

హాట్ వ్యాక్స్ :
ఈ రోజుల్లో చాలామంది దీన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అవాంఛిత రోమాల్ని సులువుగా తొలగిస్తుంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో వేసుకోవాలి.

* వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి.

* వ్యాక్స్‌ను వేడి చేసుకోవాలి. ఆ వేడిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నైఫ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వేడిని పరీక్షించుకుని అవాంఛిత రోమాలు పెరిగే వైపు నుంచి పూతలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే, తొలగించే లోపల ఆరిపోయి, తొలగించేందుకు కష్టం అవుతుంది. రెండుమూడు అంగుళాల మందం పొడవులో వేసుకుంటే చాలు.

* వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే దద్దుర్లు వస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి.

* బహుమూలాల్లో చేస్తున్నప్పుడు ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కోల్డ్ కంప్రెషన్ ఇచ్చి ఐదునిమిషాల అనంతరం వ్యాక్సింగ్ చేసుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది.

* ముఖానికి వ్యాక్సింగ్ చేసుకుంటున్నప్పుడూ రెండు మూడు అంగుళాల మేర వేసి.. ఆ భాగం సాగకుండా బొటనవేలు, చూపుడు వేలితో గట్టిగా నొక్కిపట్టుకుని వ్యాక్స్ పట్టీతో తొలగించాలి. అప్పుడు చర్మం కంది పోకుండా.. దద్దుర్లు రాకుండా ఉంటుంది.

అన్నీ చూడండి

వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి

జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

Show comments