ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (20:19 IST)

అనకాపల్లిలో కింగ్ కోబ్రా.. 12 అడుగులు.. ఎలా పట్టుకున్నారంటే? (video)

King Cobra
King Cobra
అనకాపల్లిలో కింగ్ కోబ్రా జనాలకు చుక్కలు చూపించింది. ఈ జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా ప్రజలను భయపెట్టింది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి మాడుగుల మండలం కాశీపురం శివారు గ్రామం లక్ష్మీ, పేట గ్రామంలో బాత్రూంలో 12 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు.
 
ఆపై అక్కడకు చేరుకున్న సభ్యులు.. కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో కలిసి కింగ్ కోబ్రాను వంట్లమామిడి సమీపంలో కొండ ప్రాంతంలో రెస్క్యూ టీమ్ విడిచిపెట్టింది. ఈ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసిన టీమ్‌కు ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకా అనకాపల్లిలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.