గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (18:42 IST)

వివాహేతర సంబంధం.. అలా చెడింది.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు

వివాహేతర సంబంధాలు దారుణానికి దారితీస్తున్నాయి. తాజాగా ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసిపారేసింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, కొండపి మండలంలోని మూగచింత గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసి పరారైంది. బాధితుడికి 60 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
పదేళ్ల పాటు ఈ సంబంధం కొనసాగింది. అయితే ఆర్థిక సమస్యలతో బంధం చెడింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎదురయ్యాయి. అంతే గొడవల తర్వాత ఇంటికొచ్చిన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది సదరు మహిళ.. వెంటనే బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.