శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (11:32 IST)

అరెస్టులు పూర్తి చేసిన తర్వాతే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ

minister home in fire
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాకాండతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేసిన తర్వాతే పట్టణంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. 
 
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న అల్లర్లపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు గురువారం కీలక విషయాలను వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లర్లలో పాలుపంచుకున్నవారిలో ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ హింసాకాండకు రౌడీ షీటర్లే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. 
 
అల్లర్లలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్టు చేస్తామనన్నారు. ఈ అల్లర్లకు బాధ్యులైన అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. అరెస్టులన్నీ పూర్తయ్యాక దశల వారీగా పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు.