బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (08:27 IST)

ఏపీలో ప్రజావేదిక కూల్చివేతకు రెండేళ్లు... నాటి ధ్వంస రచన పాలన...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సమావేశాల కోసం గత తెలుగుదేశం పార్టీ నిర్మించిన ప్రజా వేదికను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూల్చివేశారు. ఈ ప్రజా వేదికను వైకాపా ప్రభుత్వం కూల్చివేసి జూన్ 25వ తేదీకి రెండేళ్లు పూర్తయ్యింది.
 
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘దీని కూల్చివేతతో రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి విధ్వంసాలకు పునాది పడింది. తన పాలనా స్వభావాన్ని దీని ద్వారా ఆయన ప్రజలకు తెలియచెప్పారు. కూల్చివేతలు తప్ప కట్టింది ఒక్కటీ లేదు. 
 
ఈ రెండేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తిరోగమనబాట పట్టాయి. రెండేళ్లలోనే రాష్ట్రం ఇలా ఉంటే రాబోయే మూడేళ్లలో ఎలా ఉంటుందో!' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌కు కూల్చివేతకు ముందు, తర్వాత ప్రజా వేదిక ఫొటోలను ఆయన జత చేశారు.