శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:40 IST)

చదువు రాని మొద్దు- కదల లేని ఎద్దు అని తాతయ్య అనేవారు: వెంకయ్య

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ర

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో మా తాతయ్య మాతృభాషైన తెలుగులో ఏం చెప్పేవారంటే.."చదువు రాని మొద్దు - కదలలేని ఎద్దు'' అనే వారన్నారు. విద్యతోనే విఙ్ఞానం, వివేకం, వివేచన లభిస్తాయని తెలిపారు. 
 
అయితే ఇంకా దేశంలో 18 నుంచి 20 శాతం నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. 1947లో 18 శాతం అక్షరాస్యత సాధిస్తే, ఇప్పుడు 80 శాతం అక్షరాస్యత సాధించామని, ఇది నిజంగా గొప్ప విజయమని కొనియాడారు. అయితే మనం ఇంతటితో సంతృప్తి పడకూడదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడంపై ఆలోచించాలన్నారు.