బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (18:12 IST)

23 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజినీరింగు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 23 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని కడప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, పాలిసెట్‌ సమన్వయకర్త పీవీ కృష్ణమూర్తి తెలిపారు.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ప్రాసెసింగ్‌ రుసుమును ముందుగానే ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. జనరల్‌, బీసీ విద్యార్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.600 రుసుం ఉంటుందన్నారు. అభ్యర్థులు కులం, ఆదాయ, స్టడీ ధ్రువపత్రాలు, రీజియన్‌ వివరాలు నమోదు చేశాక ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అనంతరం వారి చరవాణికి లాగిన్‌ ఐడీ, ఐసీఆర్‌ ఫారం సంఖ్య వస్తాయన్నారు. వాటి వివరాలతో వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చని చెప్పారు.
 
ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించినా నాట్‌ ఎలిజిబుల్‌ అని వచ్చిన విద్యార్థులు ఈనెల 23 నుంచి 27 వరకు షెడ్యూలు ప్రకారం తమ దగ్గర్లోని హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు రావాల్సి ఉంటుందన్నారు. సందేహాల నివృత్తికి కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రొద్దుటూరు వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు రావాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కౌన్సెలింగ్‌ కోసం కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలకు మాత్రమే రావాలన్నారు. క్రీడా, ఎన్‌సీసీ, పీహెచ్‌ విద్యార్థులు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు, క్యాప్‌ విద్యార్థులు తమ దగ్గర్లోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు apeamcet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.