శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (11:15 IST)

ప్రియురాలు కాదు.. డబ్బు పిశాచి.. అమ్మో వద్దే వద్దు.. ప్రియుడి ఆత్మహత్య

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో ఓ యువకుడు ప్రియురాలి వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. డబ్బు కావాలని ప్రతి నిత్యం వేధించడంతో ప్రియురాలి నుంచి అతడు దూరం కావాలనుకున్నాడు. అంతేగాకుండా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. బెళగావికి చెందిన సమద్ గౌడ (23) గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే, ఆ యువతి అతన్నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుంది. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ, మరింత డబ్బు ఇవ్వాలని వేధిస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన సమద్.. సోమేశ్వర రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
ఆత్మహత్యకు ముందు ఓ లేఖను రాసి తన వద్ద పెట్టుకున్నాడు. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రియురాలి వేధింపులు తట్టుకోలేకనే సమద్ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో కేసును విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.