విజయవాడ పరిధిలో 246 కేజీల గంజాయి స్వాధీనం.. ఎనిమిది మంది అరెస్ట్
విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మరియి గుట్కా వంటి వాటి అమ్మక దార్లపై ఉక్కుపాదం మోపి గంజాయి, గుట్కా అమ్మకాలు నియంత్రించడానికి విజయవాడ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించడం జరుగుతుంది.
ఈ క్రమంలో భాగంగా అక్రమంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావుకి రాబడిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏ.డి.సి.పి. కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏ.సి.పి.లు వి.ఎస్.ఎన్.వర్మ, టి.కనకరాజు, ఎస్.ఐ కె.షేషారెడ్డి మరియు వారి సిబ్బందితో విజయవాడ, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస యాచరీస్ వద్ద వాహనాల తనిఖీలు చేశారు.
అక్రమంగా రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జిల్లా, చింతపల్లి నుండి హైదరాబాదు ఎని 5 సిజె 1235 నెంబర్ గల ఇన్నోవా మరియు ఎపి 31డిబి 5259 మరియు ముగ్గురు మహిళల నెబరుగల షిఫ్ట్ డిజైర్ రెండు కార్లు ఐదుగురు వ్యక్తులు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ. 1230000 విలువైన 246 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నిందితులు రోడ్డు మార్గం గుండా రెండు కార్లు ట్రాన్స్పోర్ట్ వాహనంలాగా ఎవరికీ అనుమానం రాకుండా ఐదుగురు వ్యక్తులు మరియు ముగ్గురు మహిళలతో కలసి ట్రావెల్ చేస్తూ కారు వెనుక డిక్కీలో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు వారికి రాబడిన సమాచారం మేరకు గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస యాచరీస్ వద్ద వాహనాలు తనిఖీలు చేశారు.
సదరు రెండు కార్లు అబి చెక్ చేయగా రెండు కార్లు 246 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు విశాఖపట్నం జిల్లా, చింతపల్లి నుండి సదరు గంజాయిని తీసుకుని విజయవాడ మీదుగా హైదరాబాద్ లో విక్రయించి లాభార్జన గడించడానికి తీసుకుని వెళ్ళుతున్నట్లు వెల్లడి అయింది.
ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న రెండు కార్లను గుర్తించి పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ అభినందించడం జరిగింది.