ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (10:43 IST)

బ్రిడ్జిని ఢీకొట్టి 40 అడుగుల ఎత్తు నుంచి వాగులోపడిన బస్సు... విషాద యాత్రగా విహార యాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం మరో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటన మరచిపోకముందే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు ప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం మరో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటన మరచిపోకముందే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ మరణించలేదు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు దగ్గర పాలేరు వంతెనను డీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టి వాగులో పడిపోయింది. దీంతో ఆ బస్సులో ప్రయాణించే 70 మంది విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ విద్యార్థులందరు యాగంటి, మహానంది విహారయాత్రకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా ఉవలపాడు మండలం కరేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినవారని గుర్తించారు.
 
అలాగే, జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. మహిళా ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటేశ్వర ట్రావెల్స్‌ వోల్వో బస్సు  వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.