గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 నవంబరు 2024 (23:32 IST)

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Oats
ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్‌లు వుంటాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి.
ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది.
ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి.
ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.