ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 నవంబరు 2024 (20:44 IST)

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

Mushrooms
విటమిన్ డి ఎముకల ఆరోగ్యంతో సహా అనేక శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ప్రమాద కారకంగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల విటమిన్ డి శరీరానికి అందేట్లు చూడాలి. ఏ పదార్థాల్లో విటమిన్ డి వుంటుందో తెలుసుకుందాము.
 
సాల్మన్ ఒక ప్రసిద్ధ కొవ్వు చేప, ఇందులో విటమిన్ D అవసరమైనంత మేరకు లభిస్తుంది.
కోడి గుడ్లు అద్భుతమైన పోషకమైన ఆహారం, వీటిని తింటుంటే విటమిన్ డి లభిస్తుంది.
బలవర్థకమైన ఆహారాలు కాకుండా, విటమిన్ డి పుట్టగొడుగులులో కూడా లభ్యమవుతుంది.
ఆవు పాలులో కాల్షియం, ఫాస్పరస్, రిబోఫ్లావిన్‌తో సహా అనేక పోషకాలతో పాటు విటమిన్ డి వుంటుంది.
తృణధాన్యాలు, ఓట్స్ తదితరాల్లో విటమిన్ డి వుంటుంది.
ఆరెంజ్ జ్యూస్ తాగుతుంటే కూడా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.