సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 29 సెప్టెంబరు 2018 (14:02 IST)

ఆమెను అలా లొంగదీసుకున్నాడు.. ఆ వీడియోలు తీసి ఆరుగురు స్నేహితులతో..?

సాఫీగా సాగిపోతున్న సంసారం. ప్రశాంతమైన జీవితం. ఉన్నట్లుండి ఒడిదుడుకులు ప్రారంభమై చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుందో వివాహిత. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు తనువు చాలించింది.

సాఫీగా సాగిపోతున్న సంసారం. ప్రశాంతమైన జీవితం. ఉన్నట్లుండి ఒడిదుడుకులు ప్రారంభమై చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుందో వివాహిత. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు తనువు చాలించింది. 
 
రాజమండ్రి సమీపంలోని చెంచుల కాలనీలో నివాసముంటున్న ధనుంజయ, ఉషలకు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ళ కుమార్తె కూడా ఉంది. భర్త ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆటో యాక్సిడెంట్ కావడంతో పాటు భర్తకు గాయాలు కావడంతో కుటుంబ భారం ఉషపై పడింది. తన స్నేహితురాలు నడుపుతున్న బ్యూటీపార్లర్‌లో వర్కర్‌గా చేరింది.
 
చేరిన 15 రోజులకే బ్యూటీపార్లర్ ఎదురుగా ఉన్న యజమాని బాలాజీ అనే వ్యక్తి ఉషకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఉషకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి ఆమెను లొంగదీసుకునేవాడు. 5 నెలల పాటు ఇలా జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఇద్దరు ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలను ఉషకు చూపించాడు బాలాజీ.
 
దీంతో ఉష షాకైంది. తన స్నేహితులు ఆరుగురు ఉన్నారని, వారి కోర్కె కూడా తీర్చాలని బెదిరించాడు ఉష. ఆ పని తాను చేయనంటూ తెగేసి చెప్పింది ఉష. దీంతో ఆమె ఫోన్ నెంబర్‌ను స్నేహితులకు ఇచ్చాడు బాలాజీ. అతడి స్నేహితులందరూ ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించారు. తీవ్ర ఆవేదనకు గురైన ఉష ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితులు పరారీలో ఉన్నారు. న్యాయం చేయాలని ఉష బంధువులు డిమాండ్ చేస్తున్నారు.