సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (18:39 IST)

డబ్బు గొడవ, స్నేహితుడికి హల్వా పెట్టి హత్య, విజయవాడలో దారుణం

Halwa
డబ్బు. ఈ డబ్బు ఎంత మేలు చేస్తుందో అంతకంటే కొన్నిసార్లు కీడు కూడా చేస్తుంటుంది. డబ్బు దగ్గర ఇద్దరి స్నేహితుల మధ్య తలెత్తిన మనస్పర్థలు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ దారుణం విజయవాడలోని రామవరప్పాడులో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 53 ఏళ్ల రామకృష్ణకి అతడి స్నేహితుడికి మధ్య డబ్బు లావాదేవీల విషయంలో స్వల్ప గొడవలున్నాయి. ఐతే అవి ప్రాణాలు తీసేంతగా వుంటాయని అతడు ఊహించలేదు. శనివారం నాడు యథాప్రకారం స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు. డబ్బు గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాక రామకృష్ణకి అతడి స్నేహితుడు చిన్న హల్వా ముక్క ఇచ్చి తినమన్నాడు.
 
ఆ ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అతడికి తీవ్ర అస్వస్థత కలిగింది. వెంటనే భార్య ఏమైందని అడగ్గా... హల్వా తిన్న దగ్గర నుంచి తనకు ఏదోలా వుందని అన్నాడు. దాంతో అతడిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడికి చికిత్స అందిస్తుండగానే రక్తపోటు తీవ్రస్థాయికి చేరుకుని మరణించాడు. హల్వాలో ఏదయినా కలిపి ఇవ్వడం వల్లనే రామకృష్ణ చనిపోయి వుంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు.