శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (19:25 IST)

అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వ‌హించిన ఆమ్ ఆద్మీ పార్టీ

అనకాపల్లిలో అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వ‌హించింది. రైతు దినోత్సవం పురస్కరించుకొని మండలంలోనిబొజ్జన కొండ వద్ద ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాధ్ బాబు ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా నాయకులు కోన లక్ష్మణ, బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి పార్లమెంటు నేత సూది కొండ మాణిక్యాలరావు రైతులతో కలిసి వేడుకలు నిర్వహించారు. రైతులకు స్వీట్ తినిపించారు. 
 
 
రైతులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ,  ప్రస్తుతం దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు అడుగడుగున ద్రోహమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  అన్నదాతల ఆత్మహత్యలను అరికట్టడంలో పాలకుల విఫలమవుతున్నారని రైతులను ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయడంలో అఖిల భారత రైతు సంఘాలు చేసిన పోరాటాన్ని కొనియాడారు. అన్నదాతలు  ఎదుర్కొంటున్న సమస్యల మీద ఐకమత్యంతో పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ నేత మావూరి రవికుమార్  సిపిఐ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలు సూరి శెట్టి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.