శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (10:45 IST)

పెళ్లై తొమ్మిది ఏళ్ళు గడిచినా.. వరకట్నం వేధింపులు ఆగలేదు.. అంతే..?

పెళ్లై తొమ్మిది ఏళ్ళు గడిచినా.. వరకట్నం వేధింపులు ఆగలేదు.. అంతే.. ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనకాపల్లి టౌన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాంధీనగరం ఇన్కమ్ టాక్స్ వీధికి చెందిన నవ్యగీత 29 గోల్కొండ మండలం కృష్ణదేవిపేట కు చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ దేవర నాగేశ్వరరావుతో 2011 లో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న నాటి నుండి నాగేశ్వరరావు తన భార్య ను నిత్యం వరకట్నం కోసం వేధిస్తూ ఉండేవాడు.
 
9 ఏళ్లు గడిచినా ఇంకా ఆ వేధింపులు తగ్గలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవ్యగీత ఇంట్లో పురుగుల మందు తాగి అస్వస్థకు గురైంది. దాంతో ఆమెని విశాఖపట్నం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.