శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:43 IST)

హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి.. ఎవరు?

Balakrishna
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో నందమూరి హీరో బాలకృష్ణ పేరు వుంది.  హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి బాలయ్యనే పోటీ చేస్తారని వెల్లడించారు. 
 
కాగా ఈ నియోజకవర్గం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ వేరే పార్టీ అభ్యర్థి గెలవలేదు. కాబట్టి ఈసారి నందమూరి బాలకృష్ణ గెలుపు సులువేనని రాజకీయ పండితులు అంటున్నారు.
 
ఇకపోతే.. నందమూరి బాలకృష్ణ 2014లో మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో కూడా అదే సీటు నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా వున్నారు. ఇక 2024లోనూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని శనివారం తేలిపోయింది.