వచ్చే ఎన్నికల్లో మోడీకి ఏపీ ప్రజలు గుండు కొడతారు : వేణుమాధవ్
వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండు కొడతారంటూ సినీ నటుడు వేణుమాధవ్ జోస్యం చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలం కిరికెర నుంచి
వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండు కొడతారంటూ సినీ నటుడు వేణుమాధవ్ జోస్యం చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలం కిరికెర నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పిన కేంద్రానికి బుద్ధి చెప్పేందుకే సైకిల్‌యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.
భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి తీరనిద్రోహం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని మాటమార్చారని ఆరోపించారు. నాలుగేళ్లు విశ్వాసంగా ఉన్నా ఫలితం లేకపోవడంతో పోరాటం తప్పలేదని చెప్పారు. కేంద్రం చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలంలో ఈ యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ మళ్లీ గెలిస్తే అరగుండు గీయించుకొంటానని ఓ వైకాపా నాయకుడు అన్నాడని, తమ నాయకులు చందాలు వేసుకొని ఖర్చులకు ఇస్తారని తిరుపతికి వెళ్లి పూర్తి గుండు తీయించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రప్రజల ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్నారని, తెలుగుజాతి అండగా నిలవాలని ఈ సందర్భంగా వేణుమాధవ్ పిలుపునిచ్చారు.