బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (16:22 IST)

అఖండ సినిమాపై అధికారుల కొరడా ...వేళ‌లు పాటించ‌లేద‌ని థియేట‌ర్ల‌పై వేటు

నిర్దేశించిన సమయానికి ముందుగానే సినిమాను ప్రదర్శించారని అఖండ సినిమా థియేటర్లను అధికారులు  సీజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని సంగమిత్ర థియేటర్‌ను అధికారులు సీజ్ చేశారు. మరి కొన్ని ప్రాంతాలలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

 
దీనితో సీజ్ చేసిన థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల ఆందోళన చేస్తున్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఓర్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, సీఎం క్యాంప్ ఆఫీసుకు అత్యంత స‌మీపంలో ఉండ‌వ‌ల్లి సెంట‌ర్లో ఉన్న ధియోట‌ర్ల‌లో మాత్రం బెనిఫిట్ షో వేసినా అధికారులెవ‌రూ ఇంత వ‌ర‌కు అడ్డు చెప్ప‌లేదు. దీనితో ఒక చోట ఒక‌లా, మ‌రోచోట మ‌రోలా ఎందుకు నిబంధ‌న‌లు విధిస్తున్నార‌ని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.