సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (13:09 IST)

మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత.. ఆ ఐదుగురు నిర్దోషులే

11 సంవత్సరాల నాటి మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల కేసును విచారించిన కోర్టు ఐదుగు

11 సంవత్సరాల నాటి మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల కేసును విచారించిన కోర్టు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చేసింది. 
 
పేలుళ్ల కేసులో నిందితులపై నేరారోపణలు నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ విఫలమైంది. దాంతో ఐదుగురు నిందితులు అసిమానంద, భరత్, దేవేందర్‌గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను కోర్టు నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఆపై రెండు నిమిషాల్లోనే ఎన్ఐఎ కోర్టు మక్కా మసీదు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  
 
మక్కామసీద్ కేసులో నిందితుల్లో ఏ ఒక్కరిపైనా అభియోగాలు రుజువు కాలేదని న్యాయవాది ఒకరు తెలిపారు. కోర్టుకు హాజరైన ఆ ఐదుగురు నిందితులపై విచారించిన న్యాయస్థానం కేసును కొట్టివేసినట్టు మీడియాకు తెలిపారు. 
 
కానీ ఈ కేసులో మిగతా నిందితులపై చార్జ్‌షీట్ కొనసాగుతున్నట్టు తెలిపారు. పదకొండేళ్ల క్రితం శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మక్కా మసీదులో పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.