మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (16:01 IST)

అంబులెన్స్ దొరకలేదు.. నాలుగు కిలోమీటర్లు మృతదేహాన్ని..?

అంబులెన్స్ దొరకలేదు. అల్లూరి జిల్లాలో మృతదేహం తరలించడానికి బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అస్వస్థతకు గురికాగా స్థానిక సీహెచ్సీకి తరలించారు.
 
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. 
 
ఇకపోతే.. ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌ సౌకర్యం లేదు. ఎవరైనా చనిపోతే ప్రైవేట్ వాహనాలే దిక్కు. ప్రైవేటు వాహనాలకు డబ్బులు చెల్లించలేని వారు తమ భుజాలపై మోయడమే దిక్కు. 
 
ఈ ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంబులెన్స్ రావడం ఆలస్యమైనప్పటికీ మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు బాధితురాలి బంధువులు నిరాకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తెలుసుకున్నారు.